Breaking News

పాడేరు నుండి రంపచోడవరం వరకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం. జెండా ఊపి ప్రారంభించిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.

0 23

 ఈరోజు తేది 25న పాడేరులో,పాడేరు నుండి చింతపల్లి – కేడి పేట, కాకరపాడు – రాజవొమ్మంగి మీదుగా రంప చోడవరం వరకు పాడేరు శాసన సభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి మరియు ఎ.పి మెడికల్ సభ్యులు తమర్భ నరసింగరావు ముఖ్య అతిధులుగా పాల్గొని,జెండా ఊపి బస్సును ప్రారంభించారు.


 ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పాడేరు, అరకు,రంపచోడవరం నియోజకవర్గాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రకటించిన ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, వెంటనే పాడేరు నుండి రంపచోడవరం వరకు బస్సును వేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


 ఈ కార్యక్రమంలో వైస్ ఎమ్.పి.పి కనకాలమ్మ,ఎమ్.పి.టి.సిలు చిట్టెమ్మ, నరసింహమూర్తి,మాజీ సర్పంచ్ సూరిబాబు, కొట్టగుల్లి నాగేంద్ర, నగేష్, నాని, నవీన్, చందు, ప్రసాద్, స్వామి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.