అమ్మా…ధనమ్మా మీ భర్త మీద కన్నా హంతకుడి మీద అంత ప్రేమాభిమానమెందుకో ? : ఆదివాసీ జెఏసి.
అమ్మా…ధనమ్మా మీ భర్త మీద కన్నా హంతకుడి మీద అంతా ప్రేమాభిమానమెందుకోనని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ మీద ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ ని తానే హత్య చేసినట్లు ఒప్పుకొని లొంగిపోతే ఆ హంతకుడికి అండగా నిలబడతామని ఎమ్మెల్యే తన అనుచరులతో ప్రకటనలు చేయిస్తూ,స్వయంగా తానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనంతబాబు సచ్చిలిరుడని,ఎటువంటి మోసకాడు కాదని,రంగురాళ్ళు తవ్వకాలు జరపలేదని,గంజాయితో,మైనింగ్ తో సంబంధం లేదని మాట్లాడటం చూసి జనం నవ్వుకొంటున్నారు.భూములు ఆక్రమించి చేపల చెరువులు నడపడం వాస్తవం కాదా అని,తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో పదవులు పొందిన మాట వాస్తవం కాదా అని,హత్య చేసిన అనంతబాబు హంతకుడు కాడా అని, మన్యంలో తనకు ఎదురు తిరిగిన ఆడదైనా,మగాడైనా బతికి బట్ట కట్టగలడా అని,ఎంతమంది పచ్చని కాపురాలలో నిప్పులు పోయలేదూ,ఆఖరికి నీ భర్త పరిస్థితి గురించి సోషల్ మీడియాలో చెపుతున్నది నిజం కాదా అని,చిచ్చడి మురళి రాష్ట్ర ఎస్టీ కమీషన్ మెంబర్ గా ఆదివాసీల కోసం మాట్లాడం మాని హంతకుడైనా అనంతబాబుకు అండగా ఉంటామని చెప్పడం రాజ్యాంగ విరుద్దం,ఒక హంతకుడికి,నేరస్తుడికి అండగా ఉంటామంటే కేసు అవుతుందన్న ఇంజిత జ్ఞానం లేకుండా ప్రకటనలు చేస్తున్నాడు,ఇలాంటి ప్రకటనలు మానుకోకపోతే జైలుకెళ్ళడానికి సిద్దంగా ఉండాలని,అనంతబాబు,వాళ్ళ నాన్న వల్ల ఆదివాసీలకు నష్టమే తప్పా లాభం లేదని,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే అనంతబాబుని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే ధనలక్ష్మీ ,మిగతా చోటామోటా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతబాబు భజన చేయడం విడ్డూరంగా ఉందని,పద్దతి మార్చుకోకపోతే వీరు కూడా జైలుకు వెళతారని జెఏసి నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,జిల్లా కన్వీనర్ రామరావుదొర,జెఏసి రాష్ట్ర సలహాదారుడు సొనాయి గంగారాజు,జిల్లా కోకన్వీనర్ జవ్వాది సూర్యనారాయణ,గిరిజన విద్యార్ధి సంఘం నాయకులు మాధవరావు,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.