జై ఆదివాసి జై భీమ్ సంస్థ గ్రంథాలయానికి జి.కె.వీధి సిడిపీఓ పుస్తకాలు వితరణ.
అల్లూరి సీతారామరాజు జిల్లా,G.K వీధి మండలం: ICDS ప్రాజెక్ట్ ఆఫీసర్ చింతపల్లిలో గల జై ఆదివాసీ జై భీమ్ సంస్థ గ్రంధాలయనికి పుస్తకాలు విరాళంగా ఇచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన గ్రంధాలయం,ఆదివాసీ గిరిజన నిరుద్యోగ యువతీ,యువకుల కోసం భారతరత్న డా,,బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన పే.బ్యాక్.టూ.సొసైటీ కోసం,గిరిజన మహనీయుల స్మృతి కోసం ఏర్పాటు చేసిన జై ఆదివాసీ జై భీమ్ గ్రంధాలయం కోసం పుస్తకాల సేకరణ జరుగుతుంది.
ఇందులో భాగంగా G.K వీధి మండలం,ICDS ప్రాజెక్ట్ ఆఫీసర్ 300 పుస్తకాలను జై ఆదివాసీ జై భీమ్ సంస్థ గ్రంధాలయనికి విరాళంగా ఇచ్చారు.సంస్థకు అధ్యక్షత వహిస్తున్న దుక్కేరి.ప్రభాకరరావు మాట్లాడుతూ ఈ పుస్తకాలు అనేకమంది నిరుద్యోగ యువతీ,యువకులకు విజ్ఞానం కోసం ఉపయోగకరంగా వుంటాయని ఆశాభావం వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా ICDS PO కి కృతజ్ఞతలు తెలిపారు.ఇదే విధంగా గిరిజన విద్యార్థినీ విద్యార్థుల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు గిరి పుత్రుల ఎదుగుదలకు సహకరించే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మీ వంతు సహాయం చెయ్యాలని కోరారు.ఫోన్ నంబర్స్,,,7981391699,9493755751,9014409484, సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రీమెల.విద్యా సాగర్,బిలస్కర్,నరేష్,సాగిన రాధాకృష్ణ,గిరిజన భవన్ లో గ్రూప్ -2 కోచింగ్ తీసుకొనే విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.