అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బంగారం పేట పంచాయతీ లోని గుమ్మళ్ళ పాలెం గ్రామంలో పూరిపాక లోనే విద్యా నిర్వహణ.
రెండు,మూడు నెలల క్రితం ఎమ్మెల్యే, ఎంపీ తమ గ్రామాన్ని సందర్శించారని, ఆ సమయంలో ముఖ్యంగా పాఠశాల నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కి,ఎంపి కి తెలియజేశామని..
అనేకసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియ చేసినప్పటికీ ఎవరు స్పందించడం లేదని గ్రామస్తులు వాపోయారు.
పాఠశాల నూతన భవనం కట్టేందుకు అక్కడ ఉన్న పాత పాఠశాల భవనాన్ని తొలగించి 10 సంవత్సరాల పైన అవుతుందని, ఇప్పటివరకు నూతన పాఠశాల భవనం మొదలు పెట్టడం కూడా లేదని గ్రామస్తులు తెలిపారు.
ప్రజాప్రతినిధులు గానీ,అధికారులు గాని ఎవరూ పట్టించుకోకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో గ్రామస్తులంతా కలిసి పాకను ఏర్పాటు చేశామని అన్నారు.
అయితే ఈ పాక కూడా వర్షాకాలంలో కారిపోతుందని, కనుక అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామంలో పాఠశాలను నిర్మించాలని గుమ్మళ్ళపాలెం గ్రామస్తులు కోరుతున్నారు.