Breaking News

ఆదివాసీ హక్కులు,చట్టాల కోసం మాట్లాడండి:ఆదివాసీ జెఏసి

0 25

ఆదివాసీ హక్కులు,చట్టాల కోసం మాట్లాడండి:ఆదివాసీ జెఏసి


గడపగడపకు వైయస్సార్,బాదుడే బాదుడు పేరుతో జనంలోకి వస్తున్న వైయస్సార్,తెదేపా నాయకులు ఆదివాసి హక్కులు,చట్టాలు,జిఓల గురించి మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి నాయకులు డిమాండ్ చేసారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి,తెదేపా అధినేత ,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్లు చెప్పుకొని జనంలోకి వస్తున్న ఆదివాసీ రాజకీయ నాయకులు తమ జాతికి భారతరాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు,చట్టాలు,జిఓలు హరించబడుతుంటే వాటిని రక్షించుకోలేని దీనావస్థలో ఉన్నారని,ఎన్నికలు దగ్గర పడుతుంటే తమ అధినేతల పేర్లతో జనం మధ్యకు వచ్చి హడావుడి చేయడం పరిపాటిగా మారింది.ఇప్పటికే ఒకసారి అవకాశం ఇచ్చి ఎంపి,ఎమ్మెల్యేలను చేస్తే,వీరు ఆదివాసీ ప్రజానీకానికి చేసింది ఏముందని ప్రశ్నించారు.ప్రభుత్వం రాష్ట్రమంతటా చేస్తున్న,ఇస్తున్న సంక్షేమ పధకాలు తప్పా మన్యానికి ప్రత్యేకంగా చేసింది ఏముందని అన్నారు.భూబదాలయింపు నిషేద చట్టం,పీసా చట్టం సక్రమంగా అమలుకాకపోవడం పై రాజకీయనాయకులు మాట్లాడటం లేదు.జిఓ నెం త్రీ రద్దు చేస్తే ఇక్కడ ఆదివాసీలకు వందశాతం రిజర్వేషన్ పోయి,నాన్ లోకల్ కు అవకాశం వచ్చింది,ఇదే విధంగా భవిష్యత్తులో ఆదివాసీ రిజర్వడ్ శాసనసభ,పార్లమెంట్ స్థానాలకు కూడా నాన్ లోకల్ కు అవకాశం ఇస్తే ఇలాగే ఊరుకొంటారా అని,మీరు ఎంపి,ఎమ్యెల్యేలుగా ఉన్నప్పుడు మీ ఆదివాసీ హక్కులు,చట్టాలు సక్రమంగా అమలు కాకుండా ఉంటే మీకు సిగ్గు,శరం లేదా అని,అది మీ చేతకానీ తనంగా భావించడం లేదా అని,జనంలోకి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ పదవి కావాలని అడగడానికి వస్తారని,ఏజెన్సీ ప్రజలు ఎంపీ,ఎమ్మెల్యేలకు ఒక్కసారే అవకాశం ఎందుకు ఇస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని వారు హితువు పలికారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ,వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,జిల్లా కన్వీనర్ రామరావుదొర,నాయకులు బొజ్జిరెడ్డి,కృష్ణదొర,నాని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.