Breaking News

మహానాడును చూసి వైసీపీలో వణుకు -నర్సీపట్నం జడ్పిటిసి సుకల రమణమ్మ

0 20

 మహానాడును చూసి వైసీపీలో వణుకు -నర్సీపట్నం జడ్పిటిసి సుకల రమణమ్మ 


 బుచ్చయ్యపేట,

                     ఇటీవల జరిగిన మహానాడును చూసి వైసీపీలో వణుకు పుడుతోందని, తెలుగు దేశాన్ని మళ్లీ గెలిపించేందుకు ప్రజలు ఈవీఎంల కోసం ఎదురుచూస్తున్నారని అనకాపల్లి పార్లమెంటరీ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి,నర్సీపట్నం జడ్పిటిసి సుకల రమణమ్మ అన్నారు.మంగళవారం పార్టీ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబుతో కలిసి వడ్డాదిలో ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు.మహానాడు జనాన్ని చూసి వైసిపి మంత్రులకు మతిపోయి సంధి ప్రేలాపనలు పేలుతున్నారన్నారు.దేవాలయం లాంటి మహానాడుని వల్లకాడుతో పోల్చడం చూస్తే వైసీపీకి పోయేకాలం దగ్గర పడిందిన్నారు.మూడేళ్ల వైసీపీ పాలనలో1200మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారని,ఇవి మంత్రి రోజాకు కనిపించలేదా అని ప్రశ్నించారు.చంద్రబాబును,లోకేష్ ను విమర్శించే అర్హత రోజాకు లేదన్నారు.అత్యాచారాలు,తెలుగు ప్రజలు వైసీపీ నేతలను తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా చంద్రబాబు సీఎం కావడం తథ్యమన్నారు.ఒక్క ఛాన్స్ పేరుతో గద్దెనెక్కిన సీఎం జగన్ రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తున్నా రన్నారు.శ్రీలంకలో మంత్రులకు పట్టిన గతే ఇక్కడ వైసిపి మంత్రులకు కూడా వస్తుందన్నారు.మంత్రి రోజా ఇప్పటికైనా హుందాగా వ్యవహరించాలన్నారు.చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు మానుకోవాలన్నారు.ఈకార్యక్రమంలో పార్టీ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు, తెలుగు మహిళ జిల్లా కోశాధికారి పోతల రమణమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, కొండపాలెం సర్పంచ్,ముచ్చకర్ల భవాని,దాడి నాగరత్నం,సరగడం వెంకటలక్ష్మి,కర్రినాగమణి,స్థానిక టిడిపి నేతలు జి.కోటేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణ,డి అప్పలనాయుడు,వియ్యపు అప్పారావు,దొడ్డి కిషోర్,దొండా నరేష్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.