అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంతర్ల గ్రామానికి చెందిన కరాటే ఓల్డ్ స్టూడెంట్ దుంపల గణేష్ కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కొఫూకాన్ కరాటే క్లబ్ ద్వారా శిక్షణ తీసుకుని ఆర్థిక పరిస్థితుల కారణంగా కొత్తగా కటింగ్ హెయిర్ స్టైల్ షాప్ పెట్టుకున్నారు.
ఈ షాపు మీద వచ్చే ఆదాయం మీదే ఆధారపడి కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ,అక్క,తమ్ముడు జీవనం కొనసాగిస్తున్నారు.
ఇటీవల కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కొఫూకాన్ కరాటే క్లబ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు సందర్శించి,తన ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది.
పాడేరు శివ దుర్గ గాయత్రి లైసెన్స్ స్టాంప్ వెండర్ కిల్లు కోటిబాబు… పాండురాజు ద్వారా ఈ విషయం తెలుసుకొని దుంపల గణేష్ కి, పాండురాజు ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
తన ఓల్డ్ స్టూడెంట్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన కిల్లు కోటిబాబుకి కరాటే అసోసియేషన్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు కరాటే క్లబ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రానున్న రోజుల్లో తమ సహకారం ఇలాగే ఉండాలని కోటిబాబు ని పాండురాజు కోరారు.