ఆశా,సీహెచ్ డబ్ల్యూ ల ధర్నాతో దద్దరిల్లిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు.
■ఆశావర్కర్ లు,సీ హెచ్ డబ్ల్యూ లు తమ సమస్యలు పరిస్కారం చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా..ఆందోళన కార్యక్రమం జరిగింది.
■ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీ *సూడిపల్లి కొండలరావు* మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా
కనీస వేతనం నెలకు రూ.15 వేలకు పెంచాలని,కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సీ హెచ్ డబ్ల్యు)లకు ఆశా వర్కర్ లు గా మార్చాలని,ఆశా లకు సంబంధం లేని పనులను చేయించారాదని అన్నారు.
■సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు సొంటేన హైమావతి మాట్లాడుతూ ఆశవర్కర్ కాకూరి సోమలమ్మ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ సెలవులు,మెడికల్ లీవ్,వేతనం తో కూడిన మెటర్నిటీ లీవ్,రిటైర్ మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు ఇవ్వాలని,62 సంవత్సరాల రిటైర్మెంట్ జీవో అమలు చేయాలి,కోవిడ్ కాలంలో మరణించిన ఆశలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలడిమాండ్ చేశారు.
■కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకులు వలసనైని లక్ష్మణ రావు మాట్లాడుతూ కుటుంబం లో అర్హులైన వారికి ఆశాలుగా తీసుకోవాలి,నేషనల్ హెల్త్ మిషన్ (NHM)నిబంధనలు ప్రకారం వెయ్యి,1200 లు జనాభా కు ఒక ఆశవర్కర్ నియమించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని,నాణ్యమైన సెల్ పోన్ లు ,4 జీ నెట్ వర్క్ సిమ్ లు ఇవ్వాలనే డిమాండ్ లతో ఆందోళనలు, ధర్నా చేసి..పీ హెచ్ మెడికల్ ఆపిసర్ పీ ప్రశాంత్ బాబు కు వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కే.పుష్పవతి,పార్వతమ్మ,ప్రశాంతి,దుర్గాభవని,ముత్యాలమ్మ,ఈశ్వరమ్మ, రాధమ్మ,వెంకట లక్ష్మి, వెంకట లక్ష్మీ, వరలక్ష్మి, విజయకుమారి,బుల్లమ్మ,దుర్గాభవని, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.