Breaking News

విధులకు సక్రమంగా రాని రాజేంద్రపాలెం పిహెచ్సి వైద్యాధికారి పై చర్యలు తీసుకోవాలి-సంజీవ్.

0 20

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు.

       ఇటీవల మండలంలో బూదరాళ్ళ పంచాయితీ బాలరేవుల గ్రామంలో రెండు శిశు మరణాలు సంభవించిన విషయం విదితమే. ఈ విషయం పై మంగళవారం పాడేరు ప్రాజెక్ట్ ఆఫీసర్ గోపాలకృష్ణ రోనంకి గారు మరియు ఇతర కొయ్యూరు మండల అధికార యంత్రాంగంతో బాలరేవుల గ్రామాన్ని సందర్శించి, శిశు మరణాల పట్ల బాధిత కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. అయితే, మరణానికి కారకులైన ప్రైవేట్ వైద్యుడి పై FIR నమోదు చేయాలని, క్లినిక్ ని సీజ్ చేయాలని ఆదేశించి యున్నారు. 

 స్థానిక వార్డ్ మెంబర్ సంజీవ్ విలేకరులకు పంపిన లేఖలో ఈ విధంగా ఉంది.

ఏదైతే రాజేంద్రపాలెం(కొయ్యూరు) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గారు విధులకు వారంతంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే వస్తుంటరన్న విషయం అందరికీ తెలిసిందే. 

విధులకు గైర్హాజరు అయ్యే డాక్టర్ విషయంలో గతంలో PO గారితో చరవాణీ లో సంప్రదించగా, ఆ doctor గారిని Set చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నిన్న బాలరేవులకు వచ్చిన PO గారు విధులకు సరిగా రాని అధికారి పై ఏ మాత్రం సంభోదించలేదు, చట్ట పరంగా చర్యలు తీసుకోవడం లేదని వారు తెలిపారు. 

 Govt. అధికారులు ఒకరికొకరు కొమ్ముకాస్తూ పోతే, సామాన్య ప్రజలకు ఏలాంటి ఉపయోగం లేదన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

 గిరిజన ప్రాంతంలో పని చేసే ప్రభుత్వ ఏ శాఖ అధికారులైన ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వం చెల్లిస్తున్న జీత-భత్యాలు సంతృప్తిగా తీసుకొని, సకాలంలో పని చేసిపెట్టి, సర్వీస్ అందించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.