Breaking News

రాజేంద్రపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిపై విచారణకు ఆదేశించిన ఐటీడీఏ పీవో

0 25

 రాజేంద్రపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిపై విచారణకు ఆదేశించిన ఐటీడీఏ పీవో


అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు.

కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సంపత్ బాబుపై విచారణకు ఆదేశించామని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ రోణంకి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 

వైద్యాధికారి విధుల నిర్వహణపై పూర్తి స్థాయిలో విచారిస్తామని చెప్పారు. 

బూదరాళ్ల పంచాయతీ బాలరేవుల గ్రామంలో ఇద్దరు చిన్నారుల మృతిపై ప్రాజెక్టు అధికారి తీవ్రంగా స్పందించారు. 

ఇటీవల ఆయన గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టారు. 

రాజేంద్రపాలెం పీహెచ్ సీ వైద్యాధికారి సంపత్ బాబు వారానికి ఒక రోజు మాత్రమే విధులకు వస్తారని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదులు, చేసిన ఆరోపణల మేరకు, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ టీ.విశ్వేశ్వర నాయుడును విచారణాధికారిగా నియమించామని పీవో చెప్పారు. వైద్యాధికారి పనితీరు, ఆసుపత్రి సేవలపై సమగ్రమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు. విచారణాధికారి నివేదిక ఆధారంగా వైద్యాధికారిపై చర్యలు తీసుకుంటామని పీవో స్పష్టం చేసారు. రాజేంద్రపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులకు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జూన్ నెల జీతాలు చెల్లించాలని ట్రెజరీ అధికారులకు ఆదేశాలు చేసారు. 

అదేవిధంగా శిశువుల మృతికి కారణమైన అక్కడ ఆర్ఎంపీ వైద్యుడిపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసామని పీవో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.