Breaking News

ఏ ముఖం పెట్టుకొని దారకొండ,సీలేరు వెళ్తారు మీరు:ఆదివాసి జెఏసి.

0 21

 ఏ ముఖం పెట్టుకొని దారకొండ,సీలేరు వెళ్తారు మీరు:ఆదివాసి జెఏసి.


మాజీ,తాజా పాడేరు ఎమ్మెల్యేలు ఈశ్వరీ,భాగ్యలక్ష్మీ ఏ ముఖం పెట్టుకొని దారకొండ,సీలేరు వెళ్తారని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి నాయకులు ప్రశ్నించారు.ఆర్వీనగర్ నుండి పాలగెడ్డ వరకు రహాదారి నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు గత కొన్నేళ్ళుగా అడుగుతున్న పట్టించుకోలేదు.గత ప్రభుత్వ హాయంలో దివంగత బిజెపి నేత లోకులగాంధీ దారకొండలో నిరహారదీక్ష చేస్తే రహాదారి పనులు వెంటనే ప్రారంభిస్తామని అప్పటి ఐటిడిఏ పిఓ డికె బాలజీ తో హామీ ఇప్పించిన ప్రభుత్వం పనులు ప్రారంభించలేదు.రాజకీయం చేస్తున్నాడని లోకులగాంధీ ని తెదేపా నాయకులు విమర్శించారని,ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉంటాదనుకొంటే ఏమి ఉపయోగంలేదని,రహాదారి నిర్మించాలని సీలేరు దగ్గరలో గల వై జంక్షన్ లో అఖిలపక్షం నిరసన చేస్తే ఆ కార్యక్రమానికి దూరంగా ఉండాలని అధికార వైయస్సార్ పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చిన ప్రస్తుత పాడేరు ఎమ్మెల్యే కొట్టుగుళ్లి భాగ్యలక్ష్మీ కానీ అధికారంలో ఉండి రహాదారి సమస్యను పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గానీ దారకొండ,సీలేరు వెళ్లే నైతిక హక్కు కోల్పోయారని,తెదేపా చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే ఈశ్వరీ ఇక్కడ సమస్యలు ఏంటీ అని అడగడం విడ్డూరంగా ఉందని,తమరు ఉన్నప్పుడు ఉన్న సమస్యలే ప్రస్తుతం కొనసాగుతున్నాయని,ప్రధాన సమస్య రహాదారి సమస్య అన్న విషయం ఈశ్వరీ మర్చిపోయారని,అక్కడ గ్రామాలలో బైక్ ర్యాలీ చేయడం కాదు గూడెం నుండి సీలేరు వరకు బైక్ ర్యాలీ చేసి,అధికారంలో ఉన్నప్పుడు ఈ రహాదారీ సమస్య పట్టించుకోలేదని ప్రజలకు క్షమాపణ చెప్పండని వారు హితువు పలికారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,జెఏసి ప్రతినిధులు రీమెల పాలు,కొర్ర నీలకంఠం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.