Breaking News

తోటలూరు సబ్ సెంటర్ లో డ్యూటీ నిల్.. జీతాలు ఫుల్.

0 21

 డ్యూటీ నిల్లు…జీతాలు ఫుల్లు.


పేరుకే సబ్ సెంటర్.రెండు సంవత్సరాల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం,రావణా పల్లి పంచాయితీ, తోటలూరు గ్రామంలో ఉన్న సబ్ సెంటర్ లో ఫస్ట్ ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న పుష్పవళ్ళి విధులలో జాయినింగ్ అయి రెండు సంవత్సరాలు అవుతున్నా కనీసం నెలరోజులు కూడా సబ్ సెంటర్ నందు ఉండి విధులు నిర్వహించలేదు.

అనేక సార్లు గ్రామస్తులు చెప్పి,చెప్పి విసిగి పోయారు తప్ప,ఏఎన్ఎం మాత్రం పద్ధతి మార్చుకోలేదు.నాలుగైదు సార్లు వీళ్ళ పై అధికార్లు అయిన మెడికల్ ఆఫీసర్స్ కి కూడా తెలియజేయడం జరిగింది.అయినా ఆమె తీరు మాత్రం మారలేదు.

ఎవరికైనా ఆరోగ్యం బాగోక పోతే సబ్ సెంటర్ లో ఏఎన్ఎం లేక పోవడంతో ప్రతి చిన్న దానికి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కృష్ణాదేవిపేట వెళ్ళాల్సి వస్తుంది.ఏఎన్ఎం బుధవారం పూట పిల్లలకు టీకాలు వేసేందుకు ఉదయం 10 గంటలు దాటిన తరువాత వచ్చి మధ్యాహ్నం 12pm,1pm సమయంలో వెళ్ళి పోతారు. మరియు అప్పడప్పుడు సంతకాలు పెట్టుకోవడానికి మాత్రం వస్తున్నారు.అయితే అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో ఇక్కడ మాత్రం ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది పరిస్థితి.


అయితే ఇది ఇలా ఉండగా ఈ తోటలూరు గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు.


ఆ గ్రామంలో పనిచేసే అంగన్వాడీ టీచర్ తన సొంత స్థలంలో ఒక పాక ను ఏర్పాటు చేసుకుని అక్కడ విధులు నిర్వహించడం జరిగింది.‌


ఆ పాక కూడా పూర్తిగా పాడై పోవడంతో,తన ఇంట్లోనే సామాన్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.


అయితే తోటలూరు గ్రామంలో ఉన్న సబ్ సెంటర్ వల్ల,సబ్ సెంటర్ పరిధిలో ఉన్న ప్రజలకు కనీసం వందలో 20 శాతం కూడా ప్రయోజనం లేదు.


కనీసం కడుపునొప్పి,తలనొప్పి తో ఇబ్బంది పడుతూ టాబ్లెట్ల కోసం వెళ్లినా ఎప్పుడూ సబ్ సెంటర్ తాళం వేసే ఉంటుంది.


వారానికి 3,4 రోజులైనా ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండాలని గతంలో గ్రామస్తులు ఏఎన్ఎం కి తెలియజేయడం జరిగింది.


అయినా అవేమి పట్టనట్లు ఒక్క రోజు కూడా సబ్ సెంటర్ లో ఉండటం లేదు.


కనుక ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని సబ్ సెంటర్ తీసివేసి,అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను వేరే చోటికి బదిలీ చేసి.. అంగన్ వాడి కోసం ఈ బిల్డింగ్ ఉపయోగించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.