Breaking News

రాజేంద్ర పాలెం పీహెచ్సీ డాక్టర్ సంపత్ పై విచారణ.

0 17

 రాజేంద్ర పాలెం పీహెచ్ సీ డాక్టర్ సంపత్ పై విచారణ.

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలం లోని రాజేంద్ర పాలెం పీహెచ్ సీ డాక్టర్ సంపత్ విధులకు రావడం లేదని, నెలకి రెండు,మూడు సార్లు మాత్రమే విధులకు వస్తున్నారని,దీని వల్ల ఏజెన్సీ  ప్రాంతంలో ఉన్న గిరిజనులు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకృష్ణ కి సాగిన సంజీవ్ తెలిపిన ఫిర్యాదు మేరకు ఈరోజు రాజేంద్ర పాలెం పీహెచ్ సీ నందు డిటిసివొ విశ్వేశ్వర నాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ సంపత్ పై విచారణ చేపట్టారు.

ఫిర్యాదు దారుడు అయిన బూధరాళ్ళ పంచాయితీ వార్డు మెంబర్ సాగిన సంజీవ్ తో మరియు మెడికల్ సిబ్బందితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకున్నారు.

డిటిసివో మెడికల్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి చిన్న దానికి పేషెంట్లకు పోలీసు కంప్లైంట్ ఇస్తామని బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అది సరైన పద్ధతి కాదని అన్నారు.

అంబులెన్స్ డ్రైవర్ ని లేపి పేషెంట్లు దగ్గర డబ్బులు అడుగుతున్నట్లు తెలిసిందని ఆ విధానం సరైంది కాదని, మళ్ళీ ఇలాంటి కంప్లైంట్ వస్తే  నీపై యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

పేషెంట్ లకు పెట్టే భోజనం కూడా సరిగా మెయిన్ టెయిన్ చేయడం లేదని తనకు తెలిసిందని, పేషెంట్ తో పాటు ఇంకొకరు వస్తే ఇద్దరికీ భోజనం ఏర్పాటు చేయాలని,ఒక పార్శిల్ తీసుకువచ్చి ఇద్దరిని పంచుకోమని చెప్పొద్దని అన్నారు.

విచారణ అనంతరం సంజీవ్ మీడియా వారితో మాట్లాడుతూ ఈ విషయం బయటకు రానివ్వకుండా ఉండేందుకు హాస్పిటల్ సిబ్బంది తనకు డబ్బులు కూడా ఆఫర్ చేశారని,డబ్బులకు లొంగే ప్రసక్తే లేదని, విధులకు రాకుండా, కనీసం ప్రజలకు సర్వీస్ చేయని డాక్టర్ ని వేరే చోటికి బదిలీ చేసి,ఈ హాస్పిటల్ లో వేరే డాక్టర్ ని నియమించాలని మీడియా ముఖంగా అధికారులను కోరారు.

అనంతరం సాగిన బాలయ్య పడాల్ అనే వ్యక్తి మాట్లాడుతూ హాస్పిటల్ సిబ్బంది తీరుపై మండిపడ్డారు.

విచారణ అనంతరం డిటిసివో టి.విశ్వేశ్వరనాయుడు ఈ రిపోర్టును పివో కి అందజేస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.