Breaking News

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేసిన రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం.

0 20

 జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేసిన రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం.

అల్లూరి సీతారామరాజు జిల్లా:

అరకు నియోజకవర్గ యువనేత సివేరి అబ్రహం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసి వివిధ సమస్యలు వివరించారు. తాను ఇటివలే అనేక గ్రామాలు పర్యటించానని, కనీసం మంచి నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం కూడా లేవని, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు 108 అంబులెన్స్ తిరగక ప్రజలు డొలిమోత మోస్తూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తాను స్వయంగా కాలినడకన వెళ్లి వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసానని, వాటి వివరాలను వినతిపత్రం లో పొందుపర్చానని, తక్షణమే రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు రోడ్డు మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ని అబ్రహం కోరారు.

Leave A Reply

Your email address will not be published.