Breaking News

ప్రస్తుత ఎంఎల్ఏ,ఎంపీ లకు రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించేది లేదంటూ వైసిపి పార్టీ సీనియర్ నేతలు సమావేశం.

0 23

 ప్రస్తుత ఎంఎల్ఏ,ఎంపీ లకు రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించేది లేదంటూ వైసిపి పార్టీ సీనియర్ నేతలు సమావేశం.


అల్లూరి సీతారామరాజు జిల్లా,పెదబరడ పంచాయితీ,మడిగుంట గ్రామంలో ఈరోజు పాడేరు,జి.మాడుగుల,చింతపల్లి,జి.కె.వీధి,కొయ్యూరు మండలాల వైసిపి పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు.

వైకాపా పార్టీ స్థాపించినప్పటి నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ బలోపేతం కోసం కష్టపడిన తమకు కరివేపాకులా తీసి పడేసారని.., ఎమ్మెల్యే,ఎంపీ కూడా పార్టీ లోకి మధ్యలోనే వచ్చి ఎంచక్కా వాటి ఫలాలు అనుభవిస్తూ,మొదటి నుండి పార్టీ కోసం కష్టపడిన వారిని గాలికి వదిలేశారని,మధ్యలో వచ్చిన వారికి పదవులు కట్టపెడుతున్నారని ఈ సమావేశంలో చర్చించుకున్నారు.

రానున్న ఎన్నికల్లో ప్రస్తుత పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కి పార్టీ టిక్కెట్ ఇస్తే ఓట్లు వేసేది లేదని అన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిణామాల రీత్యా అధిష్టానానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు.

ఇందులో భాగంగా ఎమ్మెల్యే,ఎంపీ ల తీరుపై అసంతృప్తిగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి కి తెలియజేయనున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.