Breaking News

వారం రోజుల్లో వైసిపికి ఎంపిటిసి రాజీనామా.

0 21

 వారం రోజుల్లో వైసిపికి ఎంపిటిసి రాజీనామా.

వారం రోజుల్లో తాను వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు కొయ్యూరు ఎంపిటిసి మల్లికార్జున్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనను మండల నాయకులు గానీ నియోజకవర్గ స్థాయి శాసన సభ్యురాలు కాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న పనులు అయితే మేము చేసుకోగలుగుతున్నాం కానీ తన వల్ల కాని పనిని మండల నేతల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు తమ అభ్యర్థనను ఖాతరు చేయడం లేదన్నారు. సొంత పనులు చేయించుకోలేని తాను సెగ్మెంట్ లోని ప్రజల సమస్యలు ఎలా తీర్చగలను అని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వైసీపీ నేతలు టిడిపి నేతలకు కొమ్ముకాస్తున్నారని ఎంపిటిసి ఆరోపించారు. అందుకే తాను పార్టీకి దూరం అవ్వాలని నిర్ణయానికి వచ్చానని అన్నారు. ప్రజాసమస్యలు తీర్చలేని తాను ప్రజల్లో చులకన అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. వారం రోజుల్లో తాను వైసీపీకి రాజీనామా చేయడం ఖాయమని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.