జనసేన పార్టీలో చేరికలు
అనకాపల్లి జిల్లా: గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో వైసీపీ నుండి ఈరోజు 30 కుటుంబాలు స్థానిక నాయకులు రేగు బల్ల శివ ఆధ్వర్యంలో నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజన్న వీర సూర్య చంద్ర మరియు నర్సీపట్నం టౌన్ తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి అద్దేపల్లి సౌజన్య గారి సమక్షంలో జాయిన్ కావడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గొలుగొండ మండలం నాయకులు రేగు వల్ల శివ మరియు దొరబాబు మాట్లాడుతూ.. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గ్రామాల పర్యటనలో భాగమై ఈరోజు గొలుగొండ మండలం లో ఉన్నటువంటి సిహెచ్ నాగ పురం లో వైసిపి వార్డ్ మెంబర్ బుర్ర లోవ బాబుగారి సారథ్యంలో 30 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో జాయిన్ కావడం శుభసూచకం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షుడు చక్రవర్తి టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గం లో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో కూడా జనం కోసం జనసేన కార్యక్రమం పేరుతో గ్రామాల పర్యటన చేపడుతూ పార్టీ బలోపేతం మరియు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ పార్టీలో చేరికలు చేపడుతున్నాం అని తెలియజేశారు ఇంచార్జ్ సూరి చంద్ర మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన జెండా నర్సీపట్నం నియోజకవర్గంలో ఎగిరే విధంగా గ్రామాల పర్యటన చేస్తున్నాo అంతేకాకుండా వైసిపి మరియు టిడిపి లో ఉన్నటువంటి అసంతృప్తులు సమస్యలు ఎదుర్కొంటున్న వారు సమాజంలో మార్పు రావాలని కోరుకునే వారు మా వెంట నడుస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ నుండి 30 కుటుంబాలు మరియు జోగం పేట గ్రామం నుండి మాజీ వైస్ సర్పంచ్ గారి తనయుడు శివ పార్టీలో జాయిన్ కావడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్లా శ్రీకాంత్, లింగంపేట ఉప సర్పంచ్ లంక సత్యనారాయణ, పాత కేడీపేట ఉపసర్పంచ్ దుంపల పూడి సహదేవుడు, సలాది ల ప్రసాద్, వాసం వెంకటేష్, పాతాళ శివ, వేగి శెట్టి శ్రీను, మాకి రెడ్డి వెంకట రమణ పాల్గొన్నారు