హోమ్ నర్సింగ్ కోర్స్ లో ఉచిత శిక్షణ ను గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకోవాలి: మంప ఎస్ ఐ లోకేష్ కుమార్.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: పది ఉత్తీర్ణులైన గిరిజన మహిళలకు స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జీఎంఆర్ నైరెడు సంస్థ సంస్థ ఆధ్వర్యంలో హోమ్ నర్సింగ్ కోర్సులో ఇవ్వనున్న ఉచిత శిక్షణను గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంప ఎస్సై లోకేష్ కుమార్ సూచించారు. ఈమేరకు ఆయన మంప పరిసర గ్రామాల్లో ఆయన పర్యటించి, కరపత్రాలు పంపిణీ చేసి, గిరి మహిళలకు అవగాహన కల్పించారు. శిక్షణ అనంతరం ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు.