Breaking News

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ని ఖరారు చేయడం ఆదివాసీ జాతికే గర్వకారణం: బిజెపి నేతలు.

0 29

NDA రాష్ట్రపతి అభ్యర్థిగా ఒక సామాన్య ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ద్రౌపది ముర్ము.


ద్రౌపది ముర్ము 1958, జూన్ 20న జన్మించారు. భారతీయ రాజకీయ వేత్త, జార్ఖండ్ 9 వ గవర్నర్ భారతీయ జనతా పార్టీ సభ్యురాలు జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి 5 సంవత్సరాల పదవీకాలాన్ని (2015-2021) పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్ ద్రౌపది ముర్ము మంగళవారం జూన్ 21 2022న NDA తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము ని ప్రకటించడం జరిగింది. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయార్ భంజ్ జిల్లా బైడాపోసి గ్రామంలో ఆదివాసీ గిరిజన జాతికి చెందిన సంతాల్ కుటుంబంలో జన్మించింది. తండ్రి పేరు చిరంజీ నారాయణ్, ద్రౌపది ముర్ము చరణ్ ముర్ము ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బిజూ జనతా దళ్ సంకీర్ణ ప్రభుత్వంలో ముర్ము మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం రావాణా శాఖలో స్వతంత్ర బాధ్యతతో ఆగస్టు 6, 2002 నుండి మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధికి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఒడిశా మాజీ మంత్రి 2000- 2004 సంవత్సరంలో రాయరంగ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్. ఒడిశా నుంచి భారతదేశంలోని ఒక రాష్ట్రంలో గవర్నర్ గా మొదటి మహిళా గిరిజన నాయకురాలు. అంత్యోదయ నినాదంగా ఉన్న BJP ఒక గిరిజన మహిళను భారతదేశ మొట్టమొదటి పౌరురాలిగా నిలబెట్టాలనే నిర్ణయం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందనే విషయం మరొకసారి స్పష్టమైంది. జూన్ 21 మంగళవారం NDA రాష్ట్రపతి అభ్యర్థిగా తూర్పు ప్రాంతానికి చెందిన మహిళ ఉంటే, బాగుంటుందని, భావించామని BJP పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా తెలిపారు. NDA రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ని ఖరారు కావడం ఆదివాసీ జాతికే గర్వకారణం అని అరిమెల రాజు బిజెపి గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, మర్రి అర్జున్ రెడ్డి బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మరియు సమాచార హక్కు చట్టం జిల్లా కో కన్వీనర్, బిజెపి గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రీమల చందరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.