అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం
కొమ్మిక పంచాయతీ గంగవరం గ్రామంలో గ్రామస్తులు తమకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటివరకు వారి గ్రామానికి సరైన రహదారి లేదని ఆవేదన చెందుతున్నారు.
వారికి సరైన రహదారి సదుపాయం లేక సొంత నిధులుతో రహదారి వేసుకుంటున్నారు. అవి కూడా సరిపోకపోవడంతో గ్రామస్తులే ముందుకు వచ్చి రహదారి నిర్మాణం చేపట్టారు.
గతంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేశామని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.
తమ గ్రామానికి రహదారి మంజూరు చేయాలని ఎమ్మెల్యే,ఎంపీ, కలెక్టర్, పీఓ లను గంగవరం గ్రామస్తులు కోరుతున్నారు. కొమ్మిక గ్రామ పంచాయతీ నుండి తమ గ్రామానికి 5 కిలోమీటర్లు దూరం ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు.