Breaking News

జి.కె.వీధి సమస్యలు పీఓ,సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఎస్టీ కమిషన్ మెంబర్.

0 89
పీఓ తో మాట్లాడుతున్న ఎస్టీ కమిషన్ మెంబర్ 


 గూడెంకొత్తవీధి మండలం గూడెం పంచాయతీ చిన్న అగ్రహారం, పెద్ద అగ్రహారం సమస్యలపై ఐటీడీఏ పీవో ని, సబ్ కలెక్టర్ ని కలిసిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ మత్స్యరాస విశ్వేశ్వర రాజు.

గూడెం పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ గ్రామ ప్రజలతో కలిసి తన దృష్టికి సమస్యలు వివరించారు.

సబ్ కలెక్టర్ తో మాట్లాడుతున్న ఎస్టీ కమిషన్ మెంబర్ 



 ఐటిడిఎ పిఓ ని,సబ్ కలెక్టర్ ని కలిసి సమస్యలు వివరించడం జరిగింది.

 ముఖ్యంగా 120 మంది పైబడి పిల్లలు ఉన్నా సరే స్కూల్ భవనం లేక అంగన్వాడి భవనం లేక ఇబ్బంది పడుతున్నారని పి ఓ కి తెలియచేయడం జరిగింది.అలాగే భూ పట్టాల మార్పులు కోసం కూడా సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.